సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: బుధవారం, 2 జనవరి 2019 (16:20 IST)

'బాహుబలి' ప్రభాస్ గెస్ట్ హౌస్ ఇష్యూ.... తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు...

బాహుబలి హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు పడ్డాయి. నటుడు ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ రెగ్యులరైజేషన్ చేయమని పెట్టుకున్న దరఖాస్తును ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించింది. 
 
ఒకవేళ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్న రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్లు ఉత్తర్వులు మీవద్ద వున్నాయా? అంటూ అడిగేసరికి నీళ్లు నమలారు అధికారులు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు వుంచుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడంతో కేసును రేపటి వాయిదా వేసింది హైకోర్టు. మరి ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభాస్ తరపు న్యాయవాది అన్ని ఆధారాలను సమర్పించారు.