సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 25 జనవరి 2019 (14:50 IST)

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీల‌క పాత్ర... పోషిస్తుంది ఎవ‌రో తెలుసా..?

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. డీ.వీ.వీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన దాన‌య్య దాదాపు 300 కోట్ల‌ రూపాయలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలోని కీల‌క పాత్ర‌కు త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడుని తీసుకున్నార‌ట‌.
 
ఆ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు స‌ముద్ర‌ఖ‌ని. ఈ విష‌యాన్ని స‌ముద్ర‌ఖ‌ని ఓ త‌మిళ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌చేసారు. ఇంత‌కీ స‌ముద్ర‌ఖ‌ని ఆ ఇంట‌ర్వ్యూలో ఏం చెప్పారంటే… నాడోడిగల్ సినిమా చూసిన రాజమౌళి సార్ నాకొక సుదీర్ఘమైన మెసేజ్ పంపారు. అప్పట్నించి మేం టచ్‌లోనే ఉన్నాం. 
 
ఇటీవల నన్ను వాళ్లింటికి ఆహ్వానించి, తన కుటుంబాన్ని పరిచయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న తన తాజా చిత్రంలో ఒక కీలక పాత్ర  చేస్తావా అని అడిగారు. అప్పటికప్పుడు వెంట‌నే ఒప్పేసుకున్నా అని చెప్పారు. అదీ..సంగ‌తి.!