1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 మే 2025 (20:33 IST)

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

Mock Drills
Mock Drills
పహల్గాం దాడి నేపథ్యంలో సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన చేసింది. భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య రాష్ట్రాల్లో  మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం మే 7, 2025న ప్రజా రక్షణ కోసం సమర్థవంతంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించే రీతితో, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలిపేందుకు మాక్ డ్రిల్స్ పనికొస్తాయని పేర్కొంది. 
 
శత్రువులు దాడి చేసినప్పుడు యువకులు, విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. పహల్గామ్ దాడికి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశాలున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కేంద్రం మాక్ డ్రిల్ సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
MHA
MHA
 
ఇందుకు తోడు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని.. సైరన్ ద్వారా వారిని ఎలా అప్రమత్తం చేయాలని అంశాలపై మాక్ డ్రిక్ ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత కాశ్మీర్‌లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్‌ను ఊహించారు, ఇవి ఉగ్రవాద దాడులకు సన్నద్ధతను పెంచడానికి ఉపయోగపడతాయి.