వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ
Joe Sharma with Celebrities
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం అందింది. తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జోశర్మ తెలియజేస్తుంది. అక్కడ ప్రముఖు సెలబ్రిటీలతో కలిసి ఇంటరాక్ట్ అవడం అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జో శర్మకు WAVES సమ్మిట్ 2025 ఆహ్వానం రావడం ఆమె గ్లోబల్ సినీ ప్రాధాన్యతను సూచించడంతోపాటు, ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది.
అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్రం హీరోయిన్ జో శర్మకు 'వేవ్స్ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం ఆమె సినిమా రంగంలో ఎదుగుతున్న స్థాయిని చాటుతోంది.
మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జో శర్మ ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 'వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు.