1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 మే 2025 (19:23 IST)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

himantha biswa sharma
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమ రాష్ట్రంలోని పాకిస్తాన్ అనుకూల మద్దతుదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన వారిపై అస్సాంలో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 42కు చేరిందన్నారు. 
 
ఇప్పటికే ఇటువంటి ఆరోపణలపై ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని పేర్కొంది. 
 
మరోవైపు, జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్‌లో పర్యటించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అక్కడి ఎన్.జి.వో ఇస్తున్న సొమ్మును గౌరవ్ తీసుకుంటుున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, పాక్‌కు మద్దతు తెలిపిన 40 మందిని అరెస్టు చేసినపుడు ఆ దేశాన్ని పర్యటించిన గొగొయ్‌పై కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. పాక్‌లో ఆయన ఏయే ప్రాంతాల్లో తిరిగారో సమాచారం ఇవ్వాలని కోరారు.