''సూపర్ డీలక్స్'' నుంచి ట్రైలర్.. (వీడియో)
''సూపర్ డీలక్స్'' సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. తమిళంలో టి.కుమార రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ఈ ట్రైలర్ మొత్తం విజయ్ సేతుపతి వాయిస్‌తో సాగుతోంది. ఈ సినిమాకు వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తున్నాడు.
కొద్దినెలల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగింది. తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తవుతుందని సినీ యూనిట్ వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.