శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (14:52 IST)

దుమ్మురేపుతున్న రౌడీ బేబీ : 20 కోట్ల వ్యూస్ (Video)

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం "మారి-2". ఈ చిత్రంలో ఫిదా భామ సాయిపల్లవి హీరోయిన్. ఈ చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో గత జనవరి 2వ తేదీన అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకు ఏకంగా 20 కోట్ల 48 లక్షల 87 వేల 876 మంది వ్యూస్ వచ్చాయి. అంటే నెటిజన్లు అన్ని సార్లు ఈ పాటను వీక్షించారు. ఈ పాటలో హీరోహీరోయిన్లు అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. 
 
సాయిపల్లవి తెలుగులో నటించిన "ఫిదా" మూవీలో 'వచ్చిండే' పాటకు ఇప్పటివరకు 18 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇపుడు "మారి-2" చిత్రంలోని 'రౌడీ బేబి' పాటకు 20 కోట్ల వ్యూస్ రాబట్టుకుని గత రికార్డును చెరిపేసింది. పైగా, ఈ సాంగ్ ధనుష్‌ సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయగా, యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు సమకూర్చారు. 
 
గతంలో 'కొలవెరి డి' సాంగ్‌ను కోటి 75 లక్షల మంది చూశారు. ఇద్దరు యాక్టర్స్‌కు ఇప్పుడీ రౌడీ బేబీయే బెస్ట్ సాంగ్ నిలవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్ పాపులర్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట నాలుగో స్థానానికి చేరిన రికార్డు కూడా ఉంది. గతేడాది డిసెంబర్‌లో ఈ "మారి-2" మూవీ రిలీజైన విషయం తెలిసిందే.