ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:32 IST)

''రౌడీ బేబీ'' పాటకు ఫిదా అయిపోయారు..

''ఫిదా'' సినిమాతో ప్ర‌కంప‌న‌లు పుట్టించిన సాయి ప‌ల్ల‌వి వచ్చిందే సాంగ్‌తో యూట్యూబ్‌లో రికార్డులు నెల‌కొల్పింది. ఏకంగా 182 మిలియన్ వ్యూస్‌ సంపాదించి దక్షిణాదిన అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డు సృష్టించింది. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ హీరో ధనుష్ ''కొలవరి'" సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. 
 
అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ''మారి 2". ఈ చిత్రంలోని రౌడీ బేబీ పాట తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ''వచ్చిందే'' సాంగ్‌పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 183 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో.. దక్షిణాదిన యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ఇది నిలిచింది.