సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (13:45 IST)

సహజీవనం తప్పు లేదు.. కానీ నేను వైవాహిక జీవితాన్నే కోరుకుంటా..?

ఫిదా హీరోయిన్ సాయిపల్లవి సహజీవనంపై నోరు విప్పింది. సహజీవనం అనేది వ్యక్తిగత విషయమని.. కానీ తాను సహజీవనం చేయబోనని.. తాను కోరుకునేది వైవాహిక జీవితాన్నేనని సాయిపల్లవి స్పష్టం చేసింది. ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. 
 
తాను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని.. నటిగా మారిన తర్వాత నటనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాగా, సాయిపల్లవి నటించిన మారి-2, పడిపడిలేచె మనసు విడుదల కాగా, సాయిపల్లవి సూర్యతో కలసి నటించిన ఎన్జీకే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇదే సమయంలో మలయాళంలో ఫాహత్ ఫాజిల్ పక్కన మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.