సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (12:00 IST)

శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నచిత్రం ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు చిత్ర‌ యూనిట్. 
 
హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని నేపాల్, హైద‌రాబాద్, కోల్‌క‌త్తాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
 
విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నఈ చిత్ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ప‌డిప‌డి లేచె మ‌న‌సుకు జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైల‌ర్‌ను ఈ నెల 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఇక ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఈ నెల‌ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. 
 
శ‌ర్వానంద్, సాయిల‌ప్ల‌వి, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రియారామ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: హ‌ను రాఘ‌వ‌పూడి, నిర్మాతలు: సుధాక‌ర్ చెరుకూరి, నిర్మాణ సంస్థ‌: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్, సినిమాటోగ్ర‌ఫ‌ర్: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి, ఎడిట‌ర్: A శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, లిరిక్స్: కృష్ణ‌కాంత్.