''కొలవెరి''ని పక్కనబెట్టేసిన ''ఫిదా'' సాయిపల్లవి.. ఎలా? (వీడియో)

Last Updated: మంగళవారం, 8 జనవరి 2019 (12:05 IST)
ప్రపంచ వ్యాప్తంగా ''కొలవెరి'' పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత సారథ్యంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, సినీ హీరో ధనుష్ పాడిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. అలా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. అత్యధిక వ్యూస్, షేర్స్, లైక్స్‌ను కొల్లగొట్టింది. 
 
ఆరేళ్ల క్రితం ''వై దిస్ కొలవెరి డి'' అంటూ సాగిన ధనుష్ పాట దక్షిణాదిన హిట్ కొట్టిన పాటగా యూట్యూబ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 172 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.4 మిలియన్ లైక్స్ సంపాదించింది. అలాంటి హిట్ పాటను ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి వెనక్కి నెట్టింది. తెలుగులో ''ఫిదా'' సినిమా పాట ద్వారా కొలవెరిని పక్కనబెట్టేసింది.
 
వరుజ్ తేజ్, సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ''ఫిదా'' సినిమాలోని ''వచ్చిండే'' పాట బంపర్ హిట్ అయ్యింది. ఈ పాట..173 మిలియన్స వ్యూస్‌‌తో పాటు 418కె లైక్స్ సంపాదించింది. తద్వారా ఇప్పటి వరకు దక్షిణాదిన అత్యధిక వ్యూస్ సంపాదించిన కొలవెరి పాటను ఫిదా పాట వెనక్కి నెట్టింది. ఇక వచ్చిండే పాటకు శక్తికాంత్ కార్తిక్ సంగీతం సమకూర్చాడు. 
 
మధుప్రియ గాత్రం ఇచ్చింది. ఇంకా ఇందులో సాయిపల్లవి డ్యాన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిండే పాట ఫిదా హిట్‌లో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. దీనిపై మరింత చదవండి :