శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (10:28 IST)

బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోతున్న వెంకీ - వరుణ్ (రెచ్చిపోదాం బ్రదర్ ఫుల్ సాంగ్ రిలీజ్)

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లు కాగా, సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిస్తోంది. పైగా, వెంకటేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. అలాగే, వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. 
 
ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్‌లు తోడల్లుళ్లుగా నటించారు. ముఖ్యంగా, వ‌రుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో వెంకీకి తోడ‌ల్లుడిగా అద‌ర‌గొట్టాడు. ఇక వెంక‌టేశ్ అయితే 'నువ్వునాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' తర్వాత త‌నలోని కామెడీ యాంగిల్‌ని ప్రేక్ష‌కుల‌కి మ‌రోసారి చూపించాడు. అంతేగా అంతేగా అంటూ.. హీరోలిద్దరూ చేసే మేనరిజం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. 
 
చిత్రం చూసిన పెళ్ళైన మ‌గాళ్ళు, ఆడ‌వాళ్ళు స్టోరీలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప‌గ‌ల‌బ‌డి నవ్వుకున్నారు. రాజేంద్రప్ర‌సాద్ కూడా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లోకి కూడా చేరింది. మ‌నద‌గ్గ‌రే కాదు యూఎస్‌లోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. 
 
తాజాగా 'రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్' అంటూ సాగే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. పెళ్ళాల‌ని వ‌దిలి ఫారెన్‌కి వ‌చ్చిన వెంకీ, వ‌రుణ్, రాజేంద్ర ప్రసాద్‌లు ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో సాంగ్‌లో చూపించారు. 'ఎఫ్ 2' చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లోనే అత్యధిక లాభాలను తీసుకువచ్చిన చిత్రం కావడం విశేషం.