శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దలవాయి కుమార్
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:15 IST)

తమన్నా పెళ్లి చెడగొట్టిన వెంకటేష్... ఎలగెలాగ...?

బాహుబలి సినిమా తర్వాత తమన్నాకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి, నటించిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుండటంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుందట తమన్నా. ఇదే విషయాన్ని గత ఏడాది మీడియాతో కూడా చెప్పింది. 2019లో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది.
 
అయితే ఊహించని విధంగా ఎఫ్2 విజయం సాధించడంతో తమన్నాకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయట. కొరటాల దర్శకత్వంలో తీయబోయే సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు వినికిడి. ఇదే కాకుండా అటు తమిళంలో కూడా మరో రెండు సినిమా ఛాన్స్‌లు వచ్చాయట.
 
అవకాశాలు వస్తుండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు తమన్నా పెళ్లిని వాయిదా వేసేసుకుందట. ఇప్పుడు తమన్నా దగ్గర పెళ్లి ప్రస్తవన ఎత్తితే అప్పుడే తన పెళ్లికి తొందరేముందని, దానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతోందట. ఏదేమైనా తమన్నా పెళ్లి వాయిదా వేసుకోవడానికి మన వెంకీనే కారణం కాదంటారా.