శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:41 IST)

హీరో వెంకీ కుమార్తెకు నిశ్చితార్థం?

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె అశ్రిత పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గుసగుసలకు బ్రేక్ వేస్తూ బుధవారం రాత్రి ఆమెకు నిశ్చితార్థం జరుపుతున్నట్లు తాజా సమాచారం. 
 
హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో బుధవారం రాత్రి నిశ్చితార్థం జరగనున్నట్లు వినికిడి. అయితే ఈ నిశ్చితార్థానికి చాలా కొద్ది మంది ముఖ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారట. ఇక పెళ్లిని మార్చి నెలలో రామానాయుడు స్టూడియోలోనే చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
వెంకటేష్ కూతురు ఆశ్రిత బేకరీ రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుని, ప్రస్తుతం ఆ రంగంలో రాణించాలని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అయితే చదువుకునే సమయంలోనే ప్రేమలో పడిందని, ఇరు కుటుంబాల వారు అంగీకరించిన తర్వాతే పెళ్లి చేసుకోబోతున్నట్లు వినికిడి.