సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:22 IST)

యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?

పాపులర్ యాంకర్ల జాబితాలో రవి ఉన్నప్పటికీ ఎప్పుడూ తన పేరు జంటగానే వినిపిస్తుంటుంది. రవి-లాస్య, రవి-శ్రీముఖి ఇలా అన్నమాట. ఇక షోలతో పాటుగా వివిధ వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు రవి. పటాస్ షోతో మంచి ఫామ్‌లో ఉన్న ఇతని పెళ్లి ఎప్పటి నుండో మిస్టరీగా ఉంది. లాస్య ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలలో రవికి పెళ్లైందని తెలిపారు, కానీ రవి మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. 
 
ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా మాట దాటేసాడే కానీ, స్పష్టంగా ఏ విషయం చెప్పలేదు. ఇంకా ఏమైనా మాట్లాడితే నా పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం తనకు లేదని వాదించాడు. ఈటీవీలో జరిగే వివిధ ఈవెంట్‌లకు సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా వస్తుంటారు. అప్పుడు కూడా రవికి సంబంధించి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు.
 
కారణం తెలియదు గానీ, రవి రీసెంట్‌గా తన ఫేస్‌బుక్‌లో భార్యాపిల్లల ఫోటోలను షేర్ చేసుకున్నాడు. తనకు నిత్య సక్సేనాతో పెళ్లయ్యి, వియా అనే 3 ఏళ్ల కూతురు ఉందని ప్రకటిస్తూ వారితో కలిసున్న ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా తను ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈ పోస్ట్‌కు కొంతమంది పాప చాలా క్యూట్‌గా ఉందని కమెంట్ చేస్తుంటే, మరికొందరి నుండి నెగెటివ్ కమెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి రవికి పెళ్లయినది నిజమేనన్నమాట.