గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:36 IST)

టాలీవుడ్ దర్శకుడు హీరోయిన్లను ఆ దృష్టితో చూస్తారు: మహేష్ హీరోయిన్

ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ అమృతా రావు. 'అతిథి' చిత్రంలో ఈమె నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ చిత్రం సెట్స్‌పై ఉన్నపుడు వచ్చిన ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ప్రిన్స్ మహేష్‌ బాబుపై మనస్సు పారేసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, హీరోయిన్లను వస్తువుల్లాగా చూస్తారని వాపోయింది. 
 
టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను వస్తువుల్లా చూస్తారని, వాళ్లు తెరపై హీరోయిన్ల పాత్రలను ఆవిష్కరించే విధానం తనకు నచ్చదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ కారణంగానే అతిథి తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ కుటుంబంతో బాగా క్లోజ్ అయ్యానని చెప్పింది. కొన్నిసార్లు మహేష్ ఇంటి నుంచే భోజనం వచ్చేదని ఆమె తెలిపింది.