రష్మిక మందనకు అదృష్టం అలా తలుపు తట్టింది..?
గీత గోవిందం హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందనకు అదృష్టం తలుపు తట్టింది. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మికకు ప్రస్తుతం బంఫర్ ఆఫర్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాలో రష్మిక మందన నటించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
గీతా ఆర్ట్స్‌పై తెరకెక్కిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ కావడంతో.. మెగా క్యాంపులో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌తో నటించే ఛాన్సును కూడా రష్మిక కొట్టేసింది. ఇక రష్మిక తాజాగా నితిన్‌తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. నటనకు ప్రాధాన్యత గల రోల్స్ ఎంచుకుంటున్న రష్మిక మందన అల్లు అర్జున్ సినిమాలో మంచి క్రేజ్‌ను సంపాదించే పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది.