రష్మికపై మనసుపడిన మాటల మాంత్రికుడు?

RashmikaMandanna
Last Updated: ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:13 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నారు. "సన్నాఫ్ సత్యమూర్తి" తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇదే. ఈ చిత్రానికంటే ముందు 'జులాయ్' వచ్చింది. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఈసారి పూర్తి మార్పుకోరుకుంటున్నారట. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఈసారి దేవిశ్రీ స్థానంలో ఎస్.ఎస్. థమన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. దీనికి ఫిదా అయిన త్రివిక్రమ్.. ఈ దఫా థమన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట.

అలాగే, హీరోయిన్ల విషయంలోనూ త్రివిక్రమ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరును పరిశీలించిన ఆయన... చివరగా కియారా అద్వానీ, రష్మిక మందన్నాలపై దృష్టిసారించి.. చివరకు 'గీత గోవిందం' హీరోయిన్‌పై మనసుపడినట్టు సమాచారం. అయితే, హీరో, త్రివిక్రమ్ కలిసి ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే.దీనిపై మరింత చదవండి :