బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By mohan
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:17 IST)

49 రోజుల పాటు ఆహారం లేకుండా ఫిషింగ్ బోటులో...

అల్డి నోవెల్ అడిల్యాంగ్ అనే 18 ఏళ్ల ఇండోనేషియా కుర్రాడు సముద్రంలో 49 రోజుల పాటు చిన్న ఫిషింగ్ బోటులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికాడు. ‌ల్యాంప్‌ లైటర్‌గా పని చేసే అడిల్యాంగ్, జూలై నెలలో తన బోటుపై ఇండోనేషియాకి 125 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వ

అల్డి నోవెల్ అడిల్యాంగ్ అనే 18 ఏళ్ల ఇండోనేషియా కుర్రాడు సముద్రంలో 49 రోజుల పాటు చిన్న ఫిషింగ్ బోటులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికాడు. ‌ల్యాంప్‌ లైటర్‌గా పని చేసే అడిల్యాంగ్, జూలై నెలలో తన బోటుపై ఇండోనేషియాకి 125 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహించేందుకు వెళ్లగా, బోటు కాస్త బలమైన గాలుల తాకిడితో తన నిర్దేశ ప్రాంతం నుండి దాదాపు 1200 మైళ్ల దూరం మేర కొట్టుకుపోయింది. 
 
ఇక అతడు అలాగే 49 రోజుల పాటు ఆ బోటులోనే ఉండాల్సి వచ్చింది. చివరకు అటుగా వస్తున్న పనామానియన్ షిప్‌లోని వారు గువామ్ అనే ప్రదేశంలో అతడిని గుర్తించి, కాపాడటం వలన ఈ నెల మొదటి వారంలో ఇండోనేషియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మీడియా వారితో తన అనుభవాలను ఇలా పంచుకున్నాడు. 
 
తను ప్రయాణించిన బోటులో ఎలాంటి ఇంజన్ లేనందున అది బలమైన గాలులకు కొట్టుకొనిపోయినట్లు, అందువల్ల తాను 49 రోజుల పాటు దానిపైనే ఉండాల్సి వచ్చిందని, అలాగే తీసుకెళ్లిన ఆహారం మొదటి వారంలోనే అయిపోయిందని, త్రాగేందుకు కూడా నీరు లేనందున తన బట్టలను సముద్రము నీటిలో ముంచి, వాటిని పిండుకుని నీళ్లు త్రాగానని, తన బోటుకు లంగరు వేసినప్పటికీ, ఆటుపోట్ల వల్ల ప్రమాదానికి దారి తీసినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన జీవితం అంతటితో ముగిసిపోతుందని, తన తల్లిదండ్రులను మళ్లీ కలుసుకునే అవకాశమే ఉండదని భావించాడట. చివరకు మృత్యుంజయుడుగా తిరిగి వచ్చిన కొడుకుని చూసి తల్లిదండ్రులు సంతోషించారు.