చేపల పులుసు కోసం అత్తాకోడళ్ల రచ్చ.. చివరికి ఇద్దరు పిల్లల్ని?

Last Updated: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:55 IST)
కోడళ్ల మధ్య చేపల పులుసుపై జరిగిన వివాదం.. ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం జిల్లా, దిండివనం సందై మేడు ప్రాంతానికి చెందిన ప్రభుకు అమ్ముతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రభుతో అతని తండ్రి మీనా వుంటున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ప్రభు మరణించాడు. 
 
ఈ నేపథ్యంలో అమ్ము తన కుమారులతో కలిసి అత్తతో వుంటుంది. ఆదివారం అమ్ముతో చేపలు పులుసు కావాలని అత్త అడిగింది. చేపల పులుసుతో ఇద్దరి మధ్య జగడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము.. తన కుమారులిద్దరికీ విషం ఇచ్చి.. తాను కూడా తాగింది. 
 
ఈ ఘటనలో అమ్మ కుమారులిద్దరూ చనిపోగా, అమ్ము పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. చేపల పులుసు కోసం ఓ కుటుంబమే బలైపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.దీనిపై మరింత చదవండి :