శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:50 IST)

హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి... బర్త్‌డే ఇయర్‌కు గుర్తుగా బైక్

తమిళ సినిమా అభిమానులకే కాకుండా "పేట" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ... చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటూనే పలు టీవీ షోలు కూడా చేస్తూండడం విశేషం.
 
అయితే... బైక్‌ల పట్ల విపరీతమైన క్రేజ్‌ ఉన్న సేతుపతి, ఇటీవల ఖరీదైన బీఎండబ్ల్యు బైక్‌ను కొనుగోలు చేసి తన పుట్టిన సంవత్సరానికి గుర్తుగా ఈ బైక్‌కు ‘టీఎన్‌01 బీహెచ్‌ 1979 అనే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌‌ని కూడా సంపాదించుకున్నారు. 
 
కాగా.. విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంపై అభిమానులు ఆశలు పెంచుకున్నారు. హిజ్రాగా ఆయన అభినయం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
సమంత, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి రానున్న మార్చిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.