శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:23 IST)

పవన్‌‍ ఆ సీన్‌ను పండిస్తే.. శింబు కామెడీతో పగలబడి నవ్వించాడు..

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడదలై సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇటీవల తమిళంలో రీమేక్ చేయబడింది. 'వందా రాజాదాన్ వరువె' పేరుతో ఫిబ్రవరి 1న తమిళనాడులో విడుదలైన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు.
 
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించాడు. చివరలో రైల్వేస్టేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందులో పవన్ హావభావాలు, చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
అయితే ఇదే సీన్‌ను శింబు తమిళంలో కామెడీ చేసి పడేసాడు. తెలుగులో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీరియస్‌గా చూస్తే, తమిళంలో ఈ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట. ఇందులో అత్తయ్యగా నటించిన రమ్యకృష్ణతో శింబు డైలాగులు చెప్తుంటే జనం కామెడీ సీన్ లెక్క పగలబడి నవ్వుకున్నారట.
 
ఇప్పటికే ఈ సీన్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. తెలుగు, తమిళ వెర్షన్‌లను కంపేర్ చేస్తూ రూపొందించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారట.