శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (13:20 IST)

అత్తారింటికి దారేది తమిళ రీమేక్... పవన్ స్థానంలో ఆ హీరో మెప్పిస్తాడా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా ఇప్పటికే శాండల్‌వుడ్‌లో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తమిళ్‌లో కూడా రీమేక్ అవుతోంది. 
 
సుందర్ సి దర్శకత్వంలో శింబు హీరోగా "వందా రాజావాదాన్ వరువేన్" పేరుతో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి, మిగిలినదంతా మక్కీకి మక్కీ దించేసినట్లు ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 1.5 మిలియన్ వ్యూస్‌కి పైగా స్వంతం చేసుకుంది. హిపాప్ తమిళ దీనికి సంగీతం అందించగా, హీరోయిన్లుగా మేఘా ఆకాష్, క్యాథరీన్లు నటిస్తున్నారు.
 
ఇక ప్రధాన పాత్రధారి అత్త విషయానికొస్తే తెలుగులో నటించిన నదియా ఎంతగా పాపులర్ అయ్యారో, తర్వాత ఎన్ని అవకాశాలను స్వంతం చేసుకున్నారో తెలిసిందే. అయితే తమిళంలో అత్తగా రమ్యకృష్ణ నటించారు. ఫిబ్రవరి 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.