మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (11:39 IST)

వాట్సాప్ నుంచి పిక్చర్ ఇన్.. పిక్చర్ అవుట్ మోడ్..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ సంస్థ గత నెలలో డెస్క్‌టాప్ యూజర్ల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ అవుట్ మోడ్ ఫీచర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ షేర్డ్ వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది. వెబ్ వాట్సాప్‌కు చెందిన లేటెస్ట్ అప్‌డేట్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ అవుట్ మోడ్ అన్నీ షేర్డ్ వీడియోలకు పనిచేసింది. 
 
ముఖ్యంగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వీడియోలకు కూడా బాగానే పని చేసింది. ఈ ఫీచర్ లేటెస్ట్ వాట్సాప్ 0.3.2041 వెర్షన్‌లో ఇది పనిచేస్తుంది. ఈ యాప్‌ను తొలుత డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చెయ్యాలి. ఆపై అప్లికేషన్‌లా డెస్క్‌టాప్‌పై పనిచేస్తుందని వాట్సాప్ వెల్లడించింది.