సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (14:24 IST)

ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ ద్వారా ఓ సందేశాన్ని అనేకమందికి ఫార్వార్డ్ చేసే అవకాశం వుండేది. అయితే ఈ సందేశం లేదా వార్తలో ఎంత నిజముందనే విషయం తేలేది కాదు. కొన్ని నెలలకు ముందు అదృశ్యమైన వారిని కొత్తగా కనిపించట్లేదనే ఫేక్ వార్తలు వాట్సాప్‌లో భారీగా షేర్ అవుతూ వచ్చాయి. ఇలా వాట్సాప్ ద్వారా నకిలీ న్యూస్‌లు, సందేశాలు పలువురి షేర్ కావడంపై వాట్సాప్ యాజమాన్యం సీరియస్ అయ్యింది. 
 
ఇందులో భాగంగా విదేశాల్లో ఒకేసారి 20మందికి మాత్రమే షేర్ చేసే అవకాశం వుందని.. అదే భారత్‌లో ఐతే.. ఐదు మందికి మాత్రమే వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసే వీలుంటుందని ప్రకటించింది. కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వాట్సాప్ వినియోగదారులు కేవలం ఐదుమందికి మాత్రమే ఒకే సమయంలో షేర్ చేసే అవకాశం వుంటుందని వాట్సాప్ సంచలన ప్రకటన చేసింది.