సంబంధిత వార్తలు
- ఏ మహిళను కించపరచలేదు... 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తి... రాహుల్
- అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీ ట్వీట్లు సెక్సీయస్ట్గా ఉన్నాయి... రేఖా శర్మ
- ''ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్''లో సోనియా గాంధీగా ఎవరు? (video)
- ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై రేపు క్లారిటీ వస్తుందా?
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మమతా బెనర్జీకి ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ జరుగనుంది. ఈ ర్యాలీకి రాహుల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దేశలోని కోట్లాది మంది ప్రజలు ఆగ్రాహావేశాల కారణంగానే ఈ విపక్షాలు ఏకం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వపు బూటకపు హామీలు, అబద్ధాలతో మోసపోయారని వ్యాఖ్యానించారు.
మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని రాహుల్ పునరుద్ఘాటించారు. హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారని రాహుల్ ప్రశంసించారు.
కాగా, ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. మోడీ వ్యతిరేక పక్షాలు నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కేసీఆర్, జగన్ మినహా మిగిలిన పక్షాలన్నీ వస్తున్నాయంటూ బాబు ప్రకటించారు.
