శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (14:31 IST)

'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' అంటూ హీరోయిన్‌తో కలిసి స్టెప్పులేని ఎంపీ (వీడియో)

బాలీవుడ్ హీరోయిన్‌ రవీనా టాండన్‌తో కలిసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అధికార టీఎంసీ ఎంపీ ఒకరు వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆయన పేరు సౌగతా రాయ్. కేంద్ర మాజీ మంత్రి. 77 యేళ్ళ వయసులో ఆయన వేసిన స్టెప్పులకు ఆ ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. 
 
కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి రవీనా టాండన్‌తో పాటు.. ఎంపీ సౌగతా రాయ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా తనతో కలసి డ్యాన్స్ చేయాలని సౌగతా రాయ్‌ను రవీనా కోరింది. దీంతో, రవీనాతో కలసి ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. 1994లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'మెహ్రా'లోని 'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' సాంగ్‌కు రవీనాతో కలసి కాలు కదిపారు. 
 
అంతేకాదు తమతో పాటు స్టెప్పులేయాలని వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా రవీనా ఆహ్వానించింది. ఈ సందర్భంగా రవీనా మాట్లాడుతూ, డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని తెలిపింది.