శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (15:19 IST)

అమెరికాలో భార్య.. నాగ్‌పూర్‌లో భర్త :: వాట్సాప్ వీడియో కాల్‌ ద్వారా విడాకులు

ఇదో వింత విడాకుల కేసు. భార్య ఎక్కడో అమెరికాలో ఉంటే.. భర్త నాగ్‌పూర్‌లో ఉంటున్నారు. వీరిద్దరికీ నాగ్‌పూర్ కుటుంబ కోర్టు విడాకులు మంజూరుచేసింది. అదీకూడా వాట్సాప్ వీడియో కాల్‌లో ఈ విడాకులు మంజూరు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు ఉద్యోగ రీత్యా అమెరికాలోని మిషిగాన్‌లో నివశిస్తున్నారు. 2013లో ఆగస్టు 11వ తేదీన పెళ్లయిన వీరిద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్త అమెరికా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. 
 
ఈ కేసును విచారించిన నాగ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు వాట్సాప్ వీడియో కాల్‌తో వీరిద్దరి పెళ్లి బంధాన్ని తెంచేసింది. భార్య అమెరికాలో ఉన్నందుకు నేరుగా కోర్టుకు హాజరుకాలేనని చెప్పింది. అదేసమయంలో భర్త మాత్రం కోర్టుకు హాజరయ్యారు. దీంతో భార్య నుంచి వాట్సాప్ వీడియో కాల్‌లో విడాకులకు కోర్టు అనుమతి తీసుకుంది. దీంతో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి స్వాతి చౌహాన్ వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్యకు భరణం కింద ఒకేసారి రూ.10 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.