రాహుల్ గాంధీ ట్వీట్లు సెక్సీయస్ట్‌గా ఉన్నాయి... రేఖా శర్మ

rakha sharma
Last Updated: గురువారం, 10 జనవరి 2019 (13:24 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు జాతీయ మహిళా సంఘం నోటీసు జారీ చేసింది. రాహుల్ చేసే ట్వీట్లు శోచనీయంగా, స్త్రీ ద్వేషిగా, సెక్సీయస్ట్‌గా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు.

రాఫెల్ స్కామ్‌పై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. ప్రధాని సమాధానంపై రాహుల్ గాంధీ ట్వీట్‌ ద్వారా స్పందించారు. ఒక మహిళా మంత్రిని అడ్డుపెట్టుకుని పార్లమెంట్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించారేగానీ, రాఫెల్ డీల్‌పై మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడలేదని రాహుల్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

ఈ ట్వీట్లపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. వీటిని ఆధారంగా చేసుకుని రాహుల్‌కు నోటీసులు జారీచేసింది. నిర్మలా సీతారామన్‌పై చేసిన ట్వీట్లకు వివరణ ఇవ్వాలంటూ కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ట్వీట్లు సెక్సీయస్ట్‌గా, స్త్రీద్వేషిగా ఉన్నాయనీ, అందుకే ఆయనకు నోటీసులు జారీచేశామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :