ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై రేపు క్లారిటీ వస్తుందా?

rahul gandhi - chandrababu
శ్రీ| Last Modified గురువారం, 3 జనవరి 2019 (11:26 IST)
ఏపీ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనే అంశంపై అధిష్టానంతో రఘువీరా రెడ్డి ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది.

కర్నూలులోని నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ... టీడీపీతో పొత్తుపై ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ఏపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఒమెన్ చాందీ, ఇతర సీనియర్ నేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. రఘువీరా రెడ్డి చేసిన ఈ ప్రకటనపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రేపు ఏం నిర్ణయం వెల్లడిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.దీనిపై మరింత చదవండి :