ప్రేమ మైకంలో అంతా చెప్పేసింది.. కిడ్నీలేదనడంతో.. పెళ్లి?

love pillow
Last Updated: ఆదివారం, 27 జనవరి 2019 (10:00 IST)
మైకంలో ప్రియుడితో అంతా చెప్పేసింది ఆ ప్రియురాలు. తనకు ఒక కిడ్నీ మాత్రమే వుందనే విషయాన్ని పెళ్లికి ముందే చెప్పేసింది. కానీ ఆ నిజమే ఆ ప్రేమికుల పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆలందూరుకు చెందిన విఘ్నేశ్ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన అమ్మాయితో పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
రెండేళ్ల పాటు వారు ప్రేమలో వున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అదే ఊపులో తనకు పుట్టినప్పటి నుంచి ఓ కిడ్నీ లేదనే రహస్యాన్ని ప్రియుడు వద్ద చెప్పింది. కిడ్నీ లేకపోవడం పెళ్లికి సమస్య కాదని చెప్పిన ప్రియుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. 
 
కొద్ది రోజులకే యువతి తండ్రి చనిపోవడం.. యువతి కష్టాలకు కారణమైంది. యువతి తండ్రి మరణించడంతో విఘ్నేశ్ కుటుంబం ప్లేటు మార్చింది. కట్నంగా బంగారం అడిగింది. కిడ్నీ మార్చితేనే పెళ్లంటూ పట్టుబట్టారు. ఇక చేసేది లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :