శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (16:20 IST)

సంక్రాంతి స్పెషల్ : వివో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్... రూ.1000 డిస్కౌంట్ కూడా...

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొబైల్స్ తయారీ సంస్థ వివో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఫోన్ వినియోగదారులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను ఇచ్చి కొత్త వివో ఫోన్‌ను తీసుకునే అవకాశాన్ని కల్పించింది. పైగా, రూ.1000 రాయితీని కూడా ప్రకటించింది. 
 
భారత్‌ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వివోకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెల్సిందే. ఈ కంపెనీ తయారు చేసే స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫోన్ వినియోగదారులు త‌మ పాత స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త వివో స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే పొంద‌వ‌చ్చు. 
 
క్యాషిఫై అనే కంపెనీతో భాగ‌స్వామ్య‌మైన వివో ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. బుధవారం నుంచి ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు వినియోగ‌దారులు తాము ఎక్స్‌ఛేంజ్ చేసే పాత ఫోన్ల‌కు గాను రూ.1000 అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు. 
 
అలాగే ప‌లు వివో ఫోన్ల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. వినియోగ‌దారులు వివో ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొందాలంటే వివో ఈ-స్టోర్ కు వెళ్లి త‌మకు న‌చ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకుని ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు.