శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (12:04 IST)

ఫేక్ న్యూస్‌ను షేర్ చేసిది... యువత కానే కాదు.. అంతా వృద్ధులే

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది యువత కానేకాదని.. 65ఏళ్లకు పైబడిన వృద్ధులేనని తేలింది. లైంగిక విషయాలు, విద్యా సంబంధ విషయాలను ఫేస్‌బుక్‌లో తప్పుగా నమోదు చేసుకున్న వారిలో యువతే అధికమని అందరూ అనుకుంటారు. కానీ తాజా అధ్యయనంలో వృద్ధులే ఫేక్ న్యూస్‌కు కారణమని తేల్చారు. 
 
ఈ మేరకు న్యూయార్క్ వర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ  నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివిధ రకాల వయస్సున్న మొత్తం 3500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్లు కనుగొన్నారు.