సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 11 జనవరి 2019 (14:10 IST)

70 మందితో తెదేపా తొలి అభ్యర్థుల జాబితానా? నాన్సెన్స్... ఎవరు?

పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ 70 మందితో తొలి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిందంటూ గత ఏడాది నుంచి మీడియాలో ఒకటే హోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాబు షాకిస్తున్నారనీ, వారి సీట్లు గల్లంతవుతాయని ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలిస్తే.. వాటిజ్ దిస్ నాన్సెన్స్... మీకు ఎవరు చెప్పారు ఈ విషయం. మా స్థానాల్లో మేము చాలా బలంగా వున్నాం. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు గారికి మా పట్ల పూర్తి విశ్వాసం వుందని అంటున్నారు. అసలు ఇలాంటి గాలి వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. మరి ఈ వార్త ఎలా వచ్చిందన్నది సస్పెన్సుగా వుంది. 
 
ఇకపోతే ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకు గాను వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం వుంది. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో మునిగిపోయాయి.