శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (10:08 IST)

ఓవైపు నవ్వులు.. మరోవైపు కలెక్షన్లు : రూ.100 కోట్ల క్లబ్‌లో "ఎఫ్2''

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఎఫ్2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లు కాగా, ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
 
వరుస పరాజయాలను చవిచూసిన ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన చిత్రం. ఈ చిత్రం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమేకాకుండా, నిర్మాతపై కనకవర్షం కురిపిస్తోంది. ప్రతి థియేటర్‌లో విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.
 
అలా ఈ సినిమా థియేటర్లకు వచ్చిన 13 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకి పైగా షేర్‌ను.. ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. 
 
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా 'ఎఫ్-3' ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ సీక్వెల్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్‌లతోపాటు రవితేజ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. కాగా, వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం ఇదే తొలిసారి.