శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (16:39 IST)

#F2 సినిమా రివ్యూ.. అనిల్ అదుర్స్.. కామెడీతో కడుపుబ్బిపోయేలా చేశాడు..

సినిమా పేరు: ఎఫ్2 
దర్శకత్వం : అనిల్ రావిపూడి 
నిర్మాత పేరు: దిల్ రాజు
సంగీతం: దేవీ శ్రీ ప్ర‌సాద్
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఎఫ్‌-2 సినిమా శనివారం (జనవరి-12)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వరుణ్, వెంకీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం..
 
కథలోకి వెళితే.. 
వెంకటేష్ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తాడు. త్వరగా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. కానీ భర్తను చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే అమ్మాయి తమన్నాతో అతని వివాహం కుదురుతుంది. వరుణ్ తేజ్ మెహ్రీన్‌లు కూడా ప్రేమలో వుంటారు. వీరికీ వివాహం కుదురుతుంది. పెళ్లికి తర్వాత తమన్నా బాధలు తట్టుకోలేక వెంకీ ఒత్తిడికి గురవుతాడు. అతడిని చూసి వరుణ్ తేజ్ కూడా జడుసుకుంటారు. ఇద్దరూ కలిసి యూరప్‌కు పారిపోతారు. అక్కడ వారిద్దరూ ఏం చేశారు. తమన్నా, మెహ్రీన్‌లతో ఎలా సవాళ్లను ఎదుర్కుంటారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 
పెళ్లి అంటే నూరేళ్ల పంట అని ఎఫ్-2లో చూపించాడు అనిల్ రావిపూడి. కడుపుబ్బిపోయేలా ఆద్యంతం నవ్వించాడు. పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుంది అనేది రెండు జీవితాలను పక్కపక్కనే పెట్టి చూపించాడు. తొలి అర్థభాగంలో హాస్యం పండింది. తొలి సీన్ నుంచి చివరి వరకు నవ్వించాడు దర్శకుడు. పెళ్లికి ముందు ఏం చేసినా కూడా అందంగానే ఉంటుంది.. ఇక పెళ్లి కుదిరిన‌పుడు కాబోయే భార్య కోసం ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. 
 
కొత్తగా పెళ్లయినప్పుడు భార్యాభ‌ర్త‌లు ఎలా ఉంటారు.. ఆ త‌ర్వాత ఎలా మారిపోతారు అని అనిల్ రాసుకున్న సీన్స్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు. అదే సమయంలో వరుణ్ తేజ్, మెహరీన్ లపై వచ్చే కామెడీ ట్రాక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ క‌థ యూరప్ కు షిఫ్ట్ అయిన తర్వాత కాస్త కామెడీ తగ్గింది. కాకపోతే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌తో అక్కడ కూడా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. క్లైమాక్స్‌లో భార్య గొప్పతనం చెప్పి ముగించాడు. మొత్తానికి కామెడీతోనే సినిమా అద్భుతంగా తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు.
 
నటీనటుల నుంచి అద్భుతంగా అనిల్ రావిపూడి నటనను రాబట్టారు. వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ అదిరింది. వెంకీతో పోటీపడి కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. తమన్నా, మెహ్రీన్ అందాస ఆరబోతకే కాదు.. నటనాపరంగా మంచి మార్కులు కొట్టేశారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తో పాటు సారా పాట అదిరింది. 
 
ప్లస్ పాయింట్స్ 
కామెడీ
స్క్రీన్ ప్లే 
సినిమాటోగ్రఫీ
 
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్ 
సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీత
 
రేటింగ్ 
2.75/5