గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది
తన సోదరి కంటే ఎత్తులో చాలా పొట్టిగా వున్నాడని పెళ్లయిన 10 రోజులకే తన బావను చంపాడు బావమరిది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు మండలం యాడవురు గ్రామానికి చెందిన గణేష్ ను తమ కుమార్తె అంజినీదేవికి ఇచ్చి చేయాలని యువతి తరపు బంధువులు వెళ్లారు. ఐతే యువతి కంటే కీర్తి కంటే గణేష్ ఎత్తులో పొట్టిగా వుండటంతో పిల్లనిచ్చేందుకు వారు నిరాకరించారు.
ఐతే తొలిచూపులోనే కీర్తి, గణేష్ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో ఇక లాభంలేదనుకుని గుంటూరు జిల్లా అమరావతి శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో కీర్తి సోదరుడు దుర్గారావు నిప్పులు చెరిగాడు.
తన సోదరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న గణేష్ అంతుచూస్తానంటూ హెచ్చరించాడు. దీనితో గణేష్ నల్లపాడు పోలీసులను ఆశ్రయించి తనకు ప్రాణహాని వున్నదంటూ ఫిర్యాదు చేసాడు. ఈ క్రమంలో తన రిసెప్షన్ గొప్పగా చేసుకోవాలనుకుని బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి తిరిగి వస్తుండగా దుర్గారావు కాపు కాసాడు. సమీపానికి రాగానే గణేష్ పైన పడి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేసాడు. అనంతరం పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించాడు. తన సోదరి కంటే పొట్టిగా వున్న బావను చూసి జీర్ణించుకోలేక హత్య చేసినట్లు చెప్పాడు.