గురువారం, 27 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2025 (18:08 IST)

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

Mamita Baiju
Mamita Baiju
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్  మమిత బైజు సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
-ప్రేమలు రిలీజ్‌ తర్వాత మేకర్స్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత డైరెక్టర్ తో మీటింగ్ జరిగింది. కీర్తి తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు,  కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్‌ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది.
 
-ఆ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం వుంది. కురల్  పాత్రలో చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు.  
 
- కురల్ చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా వుంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.  
 
- ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ నాకు సవాలు గా అనిపించాయి. ఆ సీన్స్‌ కోసం నేను రాత్రంతా డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. షూట్‌ సమయంలో వాటి గురించి ఆందోళన లేకుండా సీన్‌ మీద ఫోకస్‌ చేశా. నేను ఎప్పుడూ షూట్‌కు ముందు బాగా ప్రిపేర్‌ అయి ఉండాలని చూసుకుంటాను. అందుకే ఇది నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించింది.
 
-ప్రదీప్ రంగనాథ్ తో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్. ఆయన మల్టీ ట్యాలెంటెడ్. సెట్స్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు.
 
-శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్స్ తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
 
-డైరెక్టర్ కీర్తి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇందులో వుండే ఎమోషన్స్ ఫన్ చాలా యూనిక్ గా వుంటాయి.
 
-సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. పాటలు మనసుని ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.