గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (12:27 IST)

టాలీవుడ్ మాఫియా.. తు.. సిగ్గుచేటు.. ''పేట''కు రెండే థియేటర్లా?: శ్రీరెడ్డి

''పేట'' తెలుగు సినిమా విడుదలకు థియేటర్లు లభించకపోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట తెలుగు వెర్షన్‌ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండు థియేటర్లు మాత్రమే దొరకడం సిగ్గుచేటు అని వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇంకా టాలీవుడ్ నిర్మాతలను ఈ సందర్భంగా ఏకిపారేసింది. 
 
టాలీవుడ్ మాఫియా.. తు.. సిగ్గుచేటు.. సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, దిల్ రాజులు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తున్నారు. తద్వారా చిన్న చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న నిర్మాతలను ఉరేసుకునేలా చేసేది ఈ నలుగురే. మీకూ కుమారులున్నారు. మీ ఫ్యామిలీలు నెంబర్ వన్‌గా వుండటం ఓకే కానీ.. తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరక్కపోవడం సిగ్గుచేటు. 
 
అందుకే.. ఈ నలుగురు నిర్మాతలు నిర్మించే తెలుగు సినిమాలను తమిళ డబ్బింగ్‌తో తమిళనాడులో విడుదలైతే బ్యాన్ చేయాలని శ్రీరెడ్డి పిలుపునిచ్చింది. టాలీవుడ్ మూవీ మాఫియా లీడర్లను చంపేయాలి. టాలీవుడ్‌కు ఇది సిగ్గుచేటు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇంకా పేట మూవీ డిస్ట్రిబ్యూటర్ అశోక్ గారికి సారీ చెప్పింది శ్రీరెడ్డి.