శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 18 మార్చి 2019 (21:38 IST)

యూ ట్యూబ్‌లో మ‌జిలీ సంచ‌ల‌నం..!

అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ మ‌జిలీ చిత్రం పైన భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో యూ ట్యూబ్‌లో ప‌ది మిలియ‌న్ల వ్యూస్ అన‌గా కోటి డిజిట‌ల్ వ్యూస్ సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. గోపీ సుంద‌ర్ విన‌సొంపైన బాణీలు అందించ‌డంతో ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్స్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. 
 
వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట‌ర్స్  చూస్తుంటే... చైత‌న్య‌, స‌మంత చాలా అందంగా క‌నిపిస్తూ... వ‌య‌సులో ఓ ప‌దేళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్టుగా క‌నిపిస్తున్నారు. 
 
ఈ పోస్ట‌ర్ ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది అని చెప్ప‌చ్చు. టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ట్టుగానే మ‌జిలీ సినిమా కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.