సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (15:41 IST)

సమంతపై మనసుపడిన 'ఆర్ఎక్స్‌100' దర్శకుడు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య భార్య, హీరోయిన్ సమంతపై 'ఆర్ఎక్స్-100' మూవీ దర్శకుడు అజయ్ భూపతి మనసు పారేసుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్టులో ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
తాజాగా 'ఆర్ఎక్స్100' చిత్రం తర్వాత అజయ్ భూపతి నిర్మించే చిత్రానికి మహా సముద్రం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మల్టీ స్టారర్‌గా రానున్న ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం హీరోయిన్ సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇటీవలే అజయ్ సమంతతో ఈ విషయమై సంప్రదింపులు కూడా జరిపినట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తోపాటు మరో యువ హీరో కూడా నటించనున్నట్లు టాక్. విశాఖపట్నం నుంచి జరుగుతున్న అక్రమ రవాణాల నేపథ్యంలో 'మహా సముద్రం' కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి మరి.
 
కాగా, బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన 'ఆర్ఎక్స్100' చిత్రంలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అందాలను ఆరబోయడం మొదలుకుని లిప్‌లాక్ ముద్దుల్లో మునిగితేలింది. ఆ విధంగా ఆమెతో సన్నివేశాలను దర్శకుడు అజయ్ భూపతి తీయించాడు. ఇపుడు సమంతను దర్శకుడు ఆ రేంజ్‌లో చూపిస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది.