శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:14 IST)

9 ఏళ్లు పూర్తయినందుకు సమంత అక్కినేని అలా చేసింది...

ఈ ఏడాది ఫిబ్రవరి 26తో "ఏ మాయ చేసావే" సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఆ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సమంత తర్వాత కాలంలో అగ్ర హీరోయిన్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో కూడా సమంతకు ఈ సినిమా ఎంతో మేలు చేసింది. అప్పటి నుండి చైతు- సమంత మధ్య సాగిన ప్రేమ బంధం 2017 అక్టోబర్‌లో పెళ్లితో ముడిపడిపోయింది. ఈ సందర్భంగా సమంత పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మంజుల మంగళవారం ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు. ‘అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తవుతోంది, అంతా నిన్న జరిగినట్లే ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ అభినందనలు’ అంటూ మంజుల పోస్ట్‌ చేసారు. 
 
ఈ పోస్ట్‌కు సమంత బదులిస్తూ ‘నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రీట్వీట్ చేసారు. అదే సమయంలో అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘మీరంటూ లేకుంటే నటిగా నాకు ఈ స్థానం దక్కేదే కాదు’ అని పేర్కొన్నారు.