శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:57 IST)

సమంత నిర్ణయం చైతూని చిక్కుల్లో పడేస్తుందా...?

టాలీవుడ్ ఇప్పుడు మోస్ట్ సక్సెస్‌ఫుల్ యంగ్ కపుల్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం సామ్, చై. పెళ్లికి ముందు కంటే సమంత సినీ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. గోల్డెన్ లెగ్ అనే పేరున్న ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా ఎంతో హ్యాపీగా ఉన్న వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలలో కూడా ఒకరినొకరు పొగుడుకుంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకుంది ఈ జంట.
 
సమంత ఏది అడిగినా చైతూ కాదనడు, ఏది చేస్తానన్నా అడ్డుపడడు. విమర్శలకు బలైన సమయంలో కూడా సమంతకు తోడుగానే ఉన్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదు చైతు. ఇత సమంత కొత్త నిర్ణయమేంటంటే తను ఇకపై నాన్ వెజ్ ముట్టదు. ఇది వరకైతే సమంత నాన్ వెజ్ తెగ తినేది, కానీ ఇప్పుడు ఇత తినకూడదని నిర్ణయం తీసుకుని మానేసింది. మరి ఈ నిర్ణయంతో చైతన్య కూడా నాన్ వెజ్ మానేస్తాడా లేక నా నిర్ణయం నాది అంటాడో తెలీదు మరి.
 
ఇప్పటికే మూడు చిత్రాలలో కలిసి కనిపించిన సామ్ అండ్ చై నాలుగో చిత్రంగా మజిలీ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక సమంత తమిళ సినిమా 96 రీమేక్‌లో శర్వానంద్‌కు జంటగా నటిస్తోంది.