విక్టరీ వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థానికి ఇలా వెళ్ళాను..

Last Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:59 IST)
టాలీవుడ్ స్టార్, విక్టరీ వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సమంత సందడి చేసింది. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకలో సమంత కట్టిన చీర అందరినీ ఆకట్టుకుంది.


ఈ వేడుకకు తాను ఎలా వెళ్లానో.. చెప్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది. ఏక్యా బెనారస్ డిజైనర్ శారీలో మెరిసిపోయిన సమంత, కృష్ణ దాస్ జ్యూయెలరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న బంగారు ఆభరణాలను ధరించింది. 
 
సమంతకు సాధనా సింగ్ మేకప్ చేసింది. జుకాల్కర్ హెయిర్ స్టయిల్ చేశారట. నిశ్చితార్థానికి వచ్చిన సమంత పలు వెరైటీల్లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె తాజా చిత్రం ''సీమరాజా'' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. బెల్లం కొండ శ్రీనివాస్‌తో సమంత ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుందట. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్‌కు జోడిగా సమంత అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే అల్లుడు శీనులో శ్రీనివాస్, సమంత జంటగా నటించారు. మరోసారి తెరపై కనిపించనున్న ఈ కాంబోపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దీనిపై మరింత చదవండి :