సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 9 నవంబరు 2018 (13:01 IST)

టెన్ష‌న్‌లో స‌మంత..‌. అస‌లు ఏం జ‌రిగింది..?

అక్కినేని స‌మంత ప్ర‌స్తుతం చాలా టెన్ష‌న్‌లో ఉంద‌ట‌. స‌మంత ఏంటి..? టెన్ష‌న్‌లో ఉండ‌డం ఏంటి..? అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే.. నాగ‌చైత‌న్య న‌టించిన చిత్రాలు యుద్ధం శ‌ర‌ణం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య న‌టించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా వినాయ‌క చ‌వితికి రిలీజైంది. ఈ సినిమాపై చైత‌న్య చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి కానీ.. స‌క్సస్ మాత్రం సాధించ‌లేక‌పోయింది. 
 
తాజాగా స‌వ్య‌సాచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన సవ్య‌సాచిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. కానీ... ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో చైత‌న్య‌కి వ‌రుస‌గా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో స‌మంత తెగ టెన్షన్ ప‌డుతుంద‌ట‌. చైత‌న్య మాత్రం చాలా కూల్‌గా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చైత‌న్య‌, స‌మంత క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఈ సినిమా చైత‌న్య కెరీర్‌కి చాలా కీల‌కం. అందుచేత డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో చాలా బాగా రావాలి ఈ సినిమా. అవ‌స‌ర‌మైతే ప్ర‌తి సీన్ మ‌రోసారి చెక్ చేసుకో అని చెబుతుంద‌ట‌. మ‌రి.. ఈ సినిమా అయినా చైత‌న్య‌కి మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.