శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:38 IST)

అక్కినేని అన్నదమ్ములతో ఒకేసారి కలిసి నటిస్తున్న భామ ఎవరో తెలుసా?

అక్కినేని నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ నటిస్తున్న వేర్వేరు సినిమాలలో ఒకే భామ ఇరువురికి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పేరు నిధి అగర్వాల్. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైంది. ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. తాజాగా నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ చైతూ తమ్ముడు అఖిల్‌తో పాటు 'మిస్టర్ మజ్ను' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఒకేసారి ఇద్దరి అన్నదమ్ముల చిత్రాలలో నటించడం ప్రత్యేకమని, అలాగే ఈ అనుభూతి ఏ కొందరికి మాత్రమే లభిస్తుందని, రెండు చిత్రాలలోని కథనం దేనికదే ప్రత్యేకమని, ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం తనకు సవాలుగా మారిందంటూనే తాను మంచి నటిగా నిరూపించుకునేందుకు ఈ రెండు చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు ఆమె సవ్యసాచి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చింది.