గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (14:35 IST)

'వెంకీ మామ'కి ఏమైంది..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగచైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జులైలో ఈ సినిమాని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఆగ‌ష్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది అన్నారు. అక్టోబ‌ర్ వ‌చ్చింది కానీ ఇప్ప‌టివ‌ర‌కు స్టార్ట్ కాలేదు.
 
దీంతో స్ర్కిప్టులో మార్పులు చేస్తున్నార‌ని.. ఇంకా ఆల‌స్యం అయ్యే ఛాన్స్ ఉంద‌ని టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... స్ర్కిప్ట్ రెడీగా ఉంద‌ట‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. న‌వంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని స‌మాచారం. 
 
ఫ‌స్ట్ షెడ్యూల్‌లో నాగచైత‌న్యపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. గ్రామీణ నేప‌ధ్యంలో సాగే ఈ విభిన్న క‌థా చిత్రంపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. ఈ మామాఅల్లుడు క‌లిసి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.