IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట
హైదరాబాద్-తెలంగాణలోని జిల్లాల ప్రజలకు శుభవార్త. నిరంతర వేడిగాలుల పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనివారం నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను గురించి తెలిపింది. హైదరాబాద్‌లోని ఐఎండీ ప్రకారం శనివారం కొన్ని జిల్లాల్లో మాత్రమే 'ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు' (గంటకు 30 నుండి 40 కి.మీ) కూడా వుంటాయని హెచ్చరించింది.
శనివారం నుండి, కొనసాగుతున్న వడగాలుల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే IMD-హైదరాబాద్ 30 జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కుమరంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా, మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్, 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా.
మిగిలిన జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్, 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా. ఇంతలో, గురువారం, శుక్రవారం తెలంగాణ అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలతో వేడిగాలుల పరిస్థితులు చురుగ్గా కొనసాగాయి.
ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల సహా పలు జిల్లాల్లోని దాదాపు 30 వేర్వేరు ప్రదేశాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. హైదరాబాద్‌లో కూడా, గురువారం, శుక్రవారం అనేక ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్, 42.8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.