శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (16:41 IST)

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

Asaduddin Owaisi
Asaduddin Owaisi
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాలు జరిగాయి.  హిందూస్తాన్ జిందాబాద్ - పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ముస్లింలు నిరసన తెలిపారు. బాధితుల కోసం ప్రార్థించాలని ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత , హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి.  
 
బుధవారం సాయంత్రం మలక్‌పేటలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఇలాంటి నిరసన తెలిపింది. బాధితులకు సంఘీభావంగా, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కొవ్వొత్తి వెలుగులో మార్చ్ జరిగింది. అలాగే శుక్రవారం కూడా ముస్లిం సోదరులు హైదరాబాద్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.  
Muslim Protest
Muslim Protest
 
పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ముస్లింలు నమాజ్‌ చేశారు. హైదరాబాద్ ముస్లిం సోదరులు చేసిన నిరసనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.