సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (11:55 IST)

హ్యాపీ వెడ్డింగ్ యానివర్శిరీ క్యూట్ కపుల్స్... చైసామ్‌కు నెటిజన్ల విషెస్...

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య, అక్కినేని సమంతల దంపతులు తొలి వివాహ వార్షికోత్సవ వేడుకలను శనివారం జరుపుకుంటున్నారు. వీరిద్దరూ గత యేడాది అక్టోబరు ఆరో తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది.
 
ఈ పెళ్లి తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆ తర్వాత అక్టోబరు 7వ తేదీన క్రైస్తవ ఆచారం మేరకు జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇటీవలే చైతు 'శైలజారెడ్డి అల్లుడు', సమంత 'యూటర్న్' సినిమాలతో సందడి చేశారు.
 
మొన్నటివరకూ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్ళొచ్చిన ఈ జంట.. మ్యారేజ్ తర్వాత "మజిలీ" అనే మూవీలో నటిస్తున్నారు.. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. చైతు, సమంతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.